ప్రతి క్షణం
ప్రజల పక్షం

  మెగా ఆధార్ క్యాంపులకు అపూర్వ స్పందన జిల్లా ప్రజలకు సేవలందిస్తున్నందుకు ఆనందంగా ఉంది – కలెక్టర్ జితేష్ వి. పాటిల్

మెగా ఆధార్ క్యాంపులకు అపూర్వ స్పందన
జిల్లా ప్రజలకు సేవలందిస్తున్నందుకు ఆనందంగా ఉంది – కలెక్టర్ జితేష్ వి. పాటిల్
భద్రాద్రి కొత్తగూడెం,ఆధాబ్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జూలై 9 నుండి 17 వరకు నిర్వహించిన మెగా ఆధార్ క్యాంపులు ప్రజల నుండి విశేష స్పందన అందుకున్నాయి. ఈ క్యాంపుల ద్వారా మొత్తం 6,159 మంది ఆధార్ నమోదు, సవరణలు వంటి సేవలు పొందినట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ తెలిపారు.
కలెక్టరేట్ క్యాంప్‌లో 3,772 మంది
భద్రాచలం – 801
ఇల్లందు – 714
మణుగూరు – 525
దమ్మపేట – 347

ఈ ఆధార్ క్యాంపుల్లో మొత్తం 3,500 ఫిర్యాదులు స్వీకరించబడి, వాటి పరిష్కారానికి తగిన చర్యలు చేపట్టినట్టు కలెక్టర్ వెల్లడించారు.

ఆధార్ సేవలు అందుబాటులో ఉన్న మండలాలు:

దుమ్ముగూడెం, చర్ల, గుండాల, దమ్మపేట, మణుగూరు, భద్రాచలం, ఇల్లందు, టేకులపల్లి, ముల్కలపల్లి, అన్నపూరెడ్డిపల్లి, అశ్వాపురం, పినపాక, కరకగూడెం, కొత్తగూడెం, పాల్వంచ, సుజాత్‌నగర్, చండ్రుగొండ, జూలూరు‌పాడు, చుంచుపల్లి, లక్ష్మీదేవిపల్లి మండలాల్లో ఆధార్ సేవలు అందుబాటులో ఉన్నాయి.

ఈ సేవలు పంచాయతీ కార్యాలయాలు, MPDO కార్యాలయాలు, బ్యాంకులు, పోస్టాఫీసులు, స్కూల్ ఆధార్ టీంల ద్వారా అందుబాటులో ఉన్నాయి. కొన్ని మండలాల్లో త్వరలోనే ఆధార్ సేవలు ప్రారంభం కానున్నాయి.

అవసరమైన సమాచారం కోసం:

స్కూల్ ఆధార్ టీమ్ వివరాలకు:
జిల్లా మేనేజర్ వంశీ – 7331115024

ఫిర్యాదులు లేదా సలహాల కోసం:
UIDAI హెల్ప్‌లైన్: 1947 ఇ-డిస్ట్రిక్ట్ మేనేజర్ సైదేశ్వరరావు – కలెక్టరేట్‌లో అందుబాటులో ఉంటారు.
కలెక్టర్ సూచన:
“మీ ఆధార్ – మీ హక్కు. అవసరమైన అప్డేట్లు తప్పక చేయించుకోండి. ప్రజల భాగస్వామ్యంతో సేవలను మరింత విస్తృతంగా అందించగలుగుతున్నాం.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….