కరకగూడెం పర్యటనకు సిద్ధమైన బీఆర్ఎస్ నాయకులు – హెలిపాడ్ ల్యాండింగ్ ప్రదేశాన్ని పరిశీలించిన రేగా కాంతారావు
కరకగూడెం, ఆధాబ్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలంలో శుక్రవారం జరగనున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లు జోరుగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా మండలంలోని బట్టుపల్లి స్టేడియంలో ఏర్పాటు చేసిన హెలిపాడ్ ల్యాండింగ్ ప్రదేశాన్ని జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు పరిశీలించారు.
ఆయనతో పాటు ఈ సందర్శనలో ఆర్ అండ్ బీ డిపార్ట్‌మెంట్ డిఈ సతీష్, ఏడుళ్ల బయ్యారం సీఐ వెంకటేశ్వర్లు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. వీఐపి పర్యటన నేపథ్యంలో అన్ని భద్రతా ఏర్పాట్లు, రవాణా, ట్రాఫిక్ నిర్వహణ, ప్రజల రాకపోకలపై సమీక్ష నిర్వహించారు. పర్యటన విజయవంతంగా జరిగేందుకు అధికారులతో పాటు పార్టీ శ్రేణులు సన్నద్ధంగా ఉన్నారు.









