ప్రతి క్షణం
ప్రజల పక్షం

  హత్యాచారం ఆపండి – మహిళలను కాపాడండి”: NSUI నిరసన

“హత్యాచారం ఆపండి – మహిళలను కాపాడండి”: NSUI నిరసన

భద్రాద్రి కొత్తగూడెం, జూలై 14 (ఆధాబ్ న్యూస్):
ఒడిశా రాష్ట్రం బాలాసోర్‌లోని ఫకీర్ మోహన్ అటానమస్ కాలేజీలో జరిగిన దారుణ ఘటనపై NSUI భద్రాద్రి కొత్తగూడెం జిల్లా శాఖ తీవ్ర నిరసన తెలియజేసింది. NSUI జాతీయ అధ్యక్షుడు వరుణ్ చౌదరి ఆదేశాల మేరకు, కొత్తగూడెం బస్టాండ్ సెంటర్ అమరవీరుల స్తూపం వద్ద జిల్లా అధ్యక్షుడు అజ్మీర సురేష్ నాయక్ ఆధ్వర్యంలో “బేటీ బచావో” నినాదంతో నిరసన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ, ‘‘ABVPకు చెందిన విద్యార్థిని సౌమ్య శ్రీ కాలేజీలోని HOD సమీర్ సాహు నుంచి లైంగిక వేధింపులు, మానసిక హింసను భరించలేక నిప్పంటించుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం ఆమె 90 శాతం కాలిన గాయాలతో AIMS భువనేశ్వర్‌లో చికిత్స పొందుతోంది. ఆమెకు వెంటనే న్యాయం చేయాలి,’’ అని డిమాండ్ చేశారు.

‘‘ఇది కేవలం ఒక విద్యార్థినిపై జరిగిన దాడి కాదు… ఇది ప్రతి మహిళ భద్రత, గౌరవం కోసం పోరాటం’’ అని స్పష్టం చేశారు. బిజెపి డబుల్ ఇంజిన్ ప్రభుత్వం “బేటీ బచావో” వంటి నినాదాలను కేవలం ప్రచారంగా మాత్రమే మిగిల్చిందని విమర్శించారు.

ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ టౌన్ ఉపాధ్యక్షుడు ఉస్మాన్, NSUI నాయకులు నయీమ్, కాటి సంతోష్, షేక్ షాను, నిఖిల్, సమీర్, షాహిద్, జమీర్, పవన్ తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!