మూఢనమ్మకాలకు తావులేదు: ఉపాధ్యాయులకు స్టాలిన్ గట్టి హెచ్చరిక
చెన్నై, జూలై 15 (ఆధాబ్ న్యూస్):
తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ రాష్ట్రంలోని పాఠశాలల ఉపాధ్యాయులకు గట్టి సందేశం పంపారు. “సైన్స్ సిద్ధాంతాల ప్రకారమే బోధన జరగాలి, మూఢనమ్మకాలు, అంధవిశ్వాసాలకు విద్యా వ్యవస్థలో స్థానం ఉండకూడదు,” అని ఆయన స్పష్టం చేశారు.
పిల్లల బోధనలో సైన్సు విషయాలను శాస్త్రీయంగా, ఆధారాలతో సమర్పించాలని ఆయన ఆదేశించారు. పాఠ్యపుస్తకాలలో లేదా బోధనలో ఎక్కడైనా మూఢనమ్మకాల జాడ ఉంటే, వెంటనే తమిళనాడు పాఠశాల బోర్డుకు తెలియజేయాలని ఆదేశించారు.
సమాజాన్ని అగ్రగామిగా నడిపించే మార్గం విజ్ఞానమేనని, విద్యారంగం దానిలో కీలక భూమిక పోషించాలనేది ముఖ్యమంత్రి అభిప్రాయం. విద్యార్థుల భవిష్యత్తును అంధవిశ్వాసాల బానిసలుగా కాక, శాస్త్రీయ దృక్పథంతో తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన పునరుద్ఘాటించారు.
విజ్ఞాన పథంలో దేశాన్ని ముందుకు నడిపిస్తున్న తమిళనాడు!









