మెగా ఆధార్ క్యాంపుల ద్వారా 3,700కి పైగా సమస్యలకు పరిష్కారం: కలెక్టర్ జితేష్ వి. పాటిల్
భద్రాద్రి కొత్తగూడెం, ఆధాబ్ న్యూస్: భద్రాద్రి కొత్తగూడెం
జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మూడు రోజులపాటు నిర్వహించిన మెగా ఆధార్ క్యాంపులు ప్రజల నుండి విశేష స్పందనను పొందాయి. ఈ క్యాంపుల ద్వారా మొత్తం 3,772 ఆధార్ సమస్యలు పరిష్కరించబడ్డాయని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ వెల్లడించారు.
ఈ మూడు రోజుల క్యాంపులలో భాగంగా:
కొత్త ఆధార్ నమోదులు – 489
వయోవృద్ధులకు సేవలు – 45
వికలాంగుల నమోదు – 12
ట్రాన్స్జెండర్ నమోదు – 1
బయోమెట్రిక్ & ఇతర అప్డేట్లు – 602
పుట్టిన తేది సవరణలు (DOB లిమిట్ కేసులు) – 5
ఆధార్ రద్దు కేసులు – 2
సాధారణ ఎంక్వయిరీలు – సుమారు 50
ఈ కార్యక్రమాల ద్వారా పదివేలకి పైగా ప్రజలు హాజరయ్యారు. సరైన ధ్రువీకరణ పత్రాలు లేని వారు, వాటిని సేకరించి మీ సేవా కేంద్రాల ద్వారా ఆధార్ నవీకరణ చేయాలని కలెక్టర్ సూచించారు.
చాలా రోజులుగా పెండింగ్‌లో ఉన్న ఆధార్ సంబంధిత సమస్యలు ఈ మెగా క్యాంపుల ద్వారా త్వరితగతిన పరిష్కారమయ్యాయని ఆయన పేర్కొన్నారు. ప్రజలకు నేరుగా సేవలు అందించి తక్షణ ఫలితాలు ఇవ్వడం ఈ క్యాంపుల ప్రత్యేకతగా నిలిచిందని పేర్కొన్నారు.
మండలాల వారీగా నిర్వహించే అభిమాన మెగా ఆధార్ క్యాంపులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన రాష్ట్ర యుఐడిఐ బృందం, జిల్లా మేనేజర్ సైదేశ్వరరావు, రెవెన్యూ మరియు ఐటీ సిబ్బందికి కలెక్టర్ ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.









