రేగా కాంతారావు కుటుంబాన్ని పరామర్శించిన వనమా వెంకటేశ్వరరావు, వనమా రాఘవ
కరకగూడెం,ఆధాబ్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు తల్లి మృతిచెందిన విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, కొత్తగూడెం నియోజకవర్గ ఇన్‌చార్జ్, మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు మరియు రాష్ట్ర నాయకుడు వనమా రాఘవ కరకగూడెం గ్రామానికి వెళ్లి రేగా కుటుంబాన్ని పరామర్శించారు.
మరణించిన తల్లి చిత్రపటానికి పుష్పమాల వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చి, తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ బత్తుల వీరయ్య, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మల్లెల శ్రీరామ్ మూర్తి, పార్టీ నాయకులు డిష్ నాయుడు, తెలంగాణ సురేష్, భూక్యా వీరన్న, పాల్వంచ పట్టణ మహిళా అధ్యక్షురాలు మంజుల తదితరులు పాల్గొన్నారు.









