ప్రతి క్షణం
ప్రజల పక్షం

  దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె విజయవంతం – అశ్వాపురంలో భారీ ర్యాలీ, ప్రదర్శన

దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె విజయవంతం – అశ్వాపురంలో భారీ ర్యాలీ, ప్రదర్శన

అశ్వాపురం, ఆధాబ్ న్యూస్:
దేశవ్యాప్తంగా కార్మిక సంఘాల పిలుపుపై నిర్వహించిన సార్వత్రిక సమ్మె అశ్వాపురం మండలంలో ఘనంగా నిర్వహించబడింది. వివిధ రంగాల కార్మికులు పెద్దఎత్తున పాల్గొని సమ్మెను విజయవంతం చేశారు. ఈ సందర్భంగా భవన నిర్మాణ కార్యాలయం నుండి తహసిల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించగా, అనంతరం కార్మికులు బహిరంగ సభలో పాల్గొన్నారు.

ఈ సభలో ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి వేల్పుల మల్లికార్జున్ మాట్లాడుతూ,
కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్స్‌ను తక్షణమే రద్దు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను ఆపాలని, కనీస వేతనం రూ.26,000గా చెల్లించాలని, కనీస పెన్షన్ రూ.9,000గా నిర్దేశించాలని డిమాండ్ చేస్తున్నాం” అని స్పష్టం చేశారు.

 

అలానే, కార్మికులు చేస్తున్న నిరసనల పట్ల కేంద్ర ప్రభుత్వం గంభీరంగా స్పందించాలని, ప్రజా వ్యతిరేక విధానాలను మానుకోవాలని హితవు పలికారు.
కేంద్రం మారకపోతే, రైతాంగ పోరాట స్ఫూర్తితో, చికాగో కార్మిక పోరాట జ్ఞాపకాలతో ముందుకు సాగి, మరింత ఉధృతంగా పోరాటం చేస్తాం” అని హెచ్చరించారు.

 

ఈ కార్యక్రమంలో ముఖ్యంగా పాల్గొన్నవారిలో:

సిపిఐ మండల కార్యదర్శి అనంతనేని సురేష్

అంగన్వాడి టీచర్స్ & హెల్పర్స్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డి అరుణ

ఏఐటీయూసీ మండల కార్యదర్శి ఏడేళ్లి శ్రీను

బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ మండల అధ్యక్షుడు మేలపుర సురేందర్ రెడ్డి

AISF, AIYF జిల్లా నాయకులు ఈనపల్లి పవన్ సాయి, అక్కినపల్లి నాగేంద్ర బాబు

నాయకులు: రెడ్డీబోయిన వేంకన్న, బి నాగమణి, భవాని, విజయలక్ష్మి, హంసవేణి, శైలజ, రజిత, మంగతాయారు, రమణ, దీప్తి, లత, రాంబాబు, తిప్పరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, రాజు, శ్రీను, లక్ష్మయ్య, సబ్కా అజయ్ తదితరులు పాల్గొన్నారు.

సమ్మెను విజయవంతం చేసిన కార్మిక వర్గానికి నేతలు అభినందనలు తెలిపారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!