ప్రతి క్షణం
ప్రజల పక్షం

  అలుపెరగని పోరాట యోధుడు మందాకృష్ణ మాదిగ – ఎమ్మార్పీఎస్ జెండా ఆవిష్కరణ

అలుపెరగని పోరాట యోధుడు మందాకృష్ణ మాదిగ – ఎమ్మార్పీఎస్ జెండా ఆవిష్కరణ

కరకగూడెం,ఆధాబ్ న్యూస్:
బహుజనుల హక్కుల కోసం శ్రమించిన అలుపెరగని పోరాట యోధుడు మందా కృష్ణ మాదిగ జన్మదినాన్ని పురస్కరించుకుని కరకగూడెం మండలంలోని చిరుమళ్ల ఎస్సీ కాలనీలో ఎమ్మార్పీఎస్ జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది.

ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంచి వేడుకలు నిర్వహించారు. అనంతరం గ్రామ కమిటీ ఆధ్వర్యంలో ఎమ్మార్పీఎస్ జెండాను జిల్లా నాయకులు బోయిళ్ళ వెంకటేశ్వర్లు, ఇతర గ్రామ నాయకులు ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ,మందాకృష్ణ మాదిగ సామాజిక, ఆర్థిక, రాజకీయ అసమానతల తొలగింపునకు జీవితాన్ని అంకితం చేసిన యోధుడు. వర్గీకరణ కోసం ఆయన చేసిన పోరాటం ద్వారా మాదిగ సమాజానికి న్యాయం కలిగింది,” అని అన్నారు

వికలాంగులు, వృద్ధులు, వితంతువుల కోసం పెన్షన్లు, గుండె జబ్బులతో బాధపడుతున్న చిన్నారుల ఆరోగ్యశ్రీ ఆపరేషన్లు, ఎస్సీ/ఎస్టీ ఉద్యోగుల ప్రమోషన్లలో రిజర్వేషన్లు, మహిళ భద్రత కోసం ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు వంటి అనేక సమస్యలపై ఉద్యమాలు జరిగాయని తెలిపారు.
ఆందోళనలు, రాస్తారోకోలు, దీక్షలతో 30 ఏళ్లుగా మాదిగల హక్కుల కోసం నిలకడగా పోరాడిన ఏకైక ఉద్యమం ఎమ్మార్పీఎస్,” అని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు:
గ్రామ కమిటీ ఉపాధ్యక్షులు ఇల్లందుల కృష్ణ, ఏసుబాబు, శ్రీను, సమ్మయ్య, వెంకటేశ్వర్లు, సర్వేశ్వరరావు, నరేష్, సుకుమార్, వెంకటేష్, అర్జున్, అన్నపూర్ణ, నాగలక్ష్మి, సమ్మక్క, రోహిణి తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!