ప్రతి క్షణం
ప్రజల పక్షం

  కరకగూడెంలో ఆటో యూనియన్ నూతన కమిటీ ఎన్నికలు మండల అధ్యక్షుడిగా కొమరం సాంబశివరావు ఎన్నిక

కరకగూడెంలో ఆటో యూనియన్ నూతన కమిటీ ఎన్నికలు
మండల అధ్యక్షుడిగా కొమరం సాంబశివరావు ఎన్నిక
కరకగూడం, ఆధాబ్ న్యూస్:
కరకగూడెం మండలంలోని రాళ్లవాగు పెద్దమ్మ తల్లి గుడి వద్ద ఆదివారం ఆటో డ్రైవర్లు సమావేశమై ఓటింగ్ పద్ధతిలో కొత్త కమిటీని ఎన్నుకున్నారు. మండల ఆటో యూనియన్ అధ్యక్షుడిగా కొమరం సాంబశివరావు విజయం సాధించగా, ఉపాధ్యక్షుడిగా నిట్టా సౌందర్యరావు, ప్రధాన కార్యదర్శిగా గుడ్ల రంజిత్, కోశాధికారిగా సాధనపల్లి లక్ష్మి నారాయణ, సహాయ కార్యదర్శిగా యుజ్జ సాయికుమార్ ఎన్నికయ్యారు. సలహాదారుగా గుమ్మడి వెళ్లి శ్రీను, సభ్యులుగా నర్సింహులు, సాంబ, కుమార్, సుకుమార్‌లు ఎంపికయ్యారు.

ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు కొమరం సాంబశివరావు మాట్లాడుతూ, “మా డ్రైవర్లందరూ ప్రయాణికులతో మర్యాదపూర్వకంగా మెలగాలని, క్రమశిక్షణకు ప్రాధాన్యత ఇచ్చేలా ప్రత్యేక కార్యక్రమాలు చేపడతాం. యూనియన్ నిబంధనలు పాటించేలా ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పిస్తాం. డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి నిస్వార్థంగా కృషి చేస్తాను” అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో యూనియన్ సభ్యులు చిట్టిబాబు, సమ్మయ్య, సాగర్, రవి, వేణు, శ్రీను, ఇతర ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు. కొత్త కమిటీ ఎన్నికపై ఆటో డ్రైవర్లు ఆనందం వ్యక్తం చేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!