కరకగూడెం మండలంలో కమ్యూనిటీ కనెక్ట్ కార్యక్రమం
ఆదివాసీ విద్యార్థులకు పలకలు, పుస్తకాలు పంపిణీ చేసిన కరకగూడెం పోలీసులు
కరకగూడెం,ఆధాబ్ న్యూస్: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ ఆదేశాల మేరకు కరకగూడెం మండలంలోని కొత్తూరు వలస ఆదివాసీ గ్రామం, గుత్తి కోయ గ్రామం మరియు చొప్పాల గ్రామాల్లో కరకగూడెం పోలీసుల ఆధ్వర్యంలో కమ్యూనిటీ కనెక్ట్ కార్యక్రమం నిర్వహించబడింది.
ఈ కార్యక్రమంలో భాగంగా స్థానిక విద్యార్థులు, విద్యార్థినులకు పలకలు, పుస్తకాలను పంపిణీ చేశారు. అనంతరం ఏడుల్ల బయ్యారం సీఐ వి. వెంకటేశ్వరరావు,కరకగూడెం ఎస్ఐ పి.వి .ఎన్ రావు మాట్లాడుతూ, ఆదివాసీ ప్రజలు మావోయిస్టులకు ఎట్టి పరిస్థితుల్లోనూ సహకరించవద్దని స్పష్టంచేశారు. ప్రజలు ప్రభుత్వానికి తోడుగా ఉండి అభివృద్ధి మార్గంలో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
మావోయిస్టుల సిద్ధాంతాలు కాలం చెల్లినవని, యువత చదువు ద్వారా ఉన్నత స్థానాలకు చేరాలని సూచించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొనకుండా, అసాంఘీక శక్తులకు దూరంగా ఉండాలన్నారు. అలా కాకపోతే అనవసరంగా కేసులు, జైలు శిక్షలు ఎదుర్కొనాల్సి వస్తుందని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో కరకగూడెం ఎస్ఐ పి.వి.ఎన్.రావు, స్పెషల్ పార్టీ టీజీఎస్పీ సిబ్బంది పాల్గొన్నారు.









