ప్రతి క్షణం
ప్రజల పక్షం

  మానవత్వంతో ఆర్థిక సాయం చేసిన ఎస్ఐ. రాజ్ కుమార్ బదిలీపై వెళ్తున్నా, బాధ్యతతో చూపిన సహానుభూతి

మానవత్వంతో ఆర్థిక సాయం చేసిన ఎస్ఐ. రాజ్ కుమార్
బదిలీపై వెళ్తున్నా, బాధ్యతతో చూపిన సహానుభూతి
కరకగూడెం, ఆధాబ్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం చొప్పాల గ్రామానికి చెందిన జాడీ నవీన్–వరలక్ష్మి దంపతుల కుమారుడు వరుణ్ తేజ్ పొరపాటున థమ్సప్ అనుకోని గడ్డి మందు తాగి ప్రాణాపాయ పరిస్థితిలో ప్రస్తుతం హైదరాబాద్ నిలోఫర్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నాడు. సామాజిక మధ్యమాల్లో ఈ విషయం తెలుసుకున్న ఎస్సై రాజ్ కుమార్ మానవత్వంతో స్పందించారు.
ఏడూల్లా బయ్యారం నుండి
బదిలీపై ఇతర ప్రాంతానికి వెళ్లాల్సి ఉన్నప్పటికీ, బాధ్యతాయుతంగా వ్యవహరించిన ఆయన నాలుగువేల రూపాయలు ఫోన్ పే ద్వారా ఆ కుటుంబానికి ఆర్థికంగా సహాయం చేశారు. తన డ్యూటీలో చివరి దశలో కూడా ఈ రీతిలో స్పందించడం రాజ్ కుమార్‌లోని సేవాభావాన్ని, మానవత్వాన్ని ప్రతిబింబిస్తుంది.

ఈ సందర్భంగా ఆయన తల్లిదండ్రులకు ముఖ్యమైన సూచనలు చేశారు. క్రిమి సంహారక మందులు చిన్నారులకు అందుబాటులో ఉండకుండా భద్రంగా ఉంచాలని, సెల్‌ఫోన్లు, ఇతర ఆకర్షణీయమైన వస్తువులు పిల్లలకు ఇవ్వకూడదని హెచ్చరించారు. పిల్లల విషయంలో నిర్లక్ష్యంగా తల్లిదండ్రులు వ్యవహరించకూడదని ఇలాంటి సందర్భాలు ప్రాణాంతకంగా మారే అవకాశముండటం వల్ల జాగ్రత్త అవసరమని సూచించారు.

ఎస్సై రాజ్ కుమార్ సేవా గుణం ప్రజల్లో మెప్పు పొందుతోంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!