ప్రతి క్షణం
ప్రజల పక్షం

  సమ్మక్క–సారలమ్మ మహా జాతర తేదీలు ఖరారు జనవరి 28 నుంచి 31 వరకు మహా జాతర

సమ్మక్క–సారలమ్మ మహా జాతర తేదీలు ఖరారు

జనవరి 28 నుంచి 31 వరకు మహా జాతర జరగనున్నట్లు మేడారం పూజారుల సంఘం ప్రకటన

ములుగు ,ఆధాబ్ న్యూస్:
ప్రసిద్ధ మేడారం సమ్మక్క–సారలమ్మ మహా జాతర తేదీలు ఖరారయ్యాయి. ఈ మేరకు బుధవారం నాడు మేడారం పూజారుల సంఘం అధ్యక్షులు సిద్దబోయిన జగ్గారావు అధికారికంగా ప్రకటించారు. 2026 సంవత్సరానికి గాను జనవరి 28 నుంచి 31వ తేదీ వరకు మహా జాతర జరగనుంది.

జాతర తేదీవారీ కార్యక్రమాలు ఇలా ఉన్నాయి:

🔸 28-01-2026 (బుధవారం):
సాయంత్రం 6 గంటలకు శ్రీ సారలమ్మ అమ్మవారు గద్దెకు వెలివేయడం జరుగుతుంది. అదే సమయంలో శ్రీ గోవింద రాజు మరియు పగిడిద్ద రాజులు గద్దెలకు రాగలరు.

🔸 29-01-2026 (గురువారం):
సాయంత్రం 6 గంటలకు శ్రీ సమ్మక్క అమ్మవారు గద్దెకు రాగలరు.

🔸 30-01-2026 (శుక్రవారం):
భక్తులు అమ్మవార్లకు మ్రొక్కుబడులు సమర్పించుకుంటారు. ఇది మహా జాతరలో అత్యంత ముఖ్యమైన రోజు.

🔸 31-01-2026 (శనివారం):
సాయంత్రం 6 గంటలకు శ్రీ సమ్మక్క, సారలమ్మ అమ్మవార్లు మరియు శ్రీ గోవింద రాజు, పగిడిద్ద రాజులు వన ప్రవేశం చేస్తారు. దీంతో జాతర ముగియనుంది.

ఈ మహా జాతర దక్షిణ భారతదేశంలో అత్యంత పెద్ద పటముల జానపద పూజారాధనల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. కోట్లాది భక్తులు ఈ రోజుల్లో మేడారం తీర్థ యాత్రలో పాల్గొంటారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!