ప్రతి క్షణం
ప్రజల పక్షం

  పురుగుల మందు తాగిన చిన్నారి… మెరుగైన వైద్యం కోసం సహాయం కోరుతున్న కుటుంబం

కరకగూడెం,ఆధాబ్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలంలోని చొప్పాల గ్రామానికి చెందిన జాడి నవీన్ – వరలక్ష్మి దంపతుల ఐదేళ్ల కుమారుడు వరుణ్ తేజ్, అనుకోకుండా పురుగుల మందు సేవించి ప్రాణాపాయ స్థితిలో హైదరాబాద్ నిలోఫర్ హాస్పటల్‌లో చికిత్స పొందుతున్నాడు.
తల్లిదండ్రులిద్దరూ దినసరి కూలీలు. శాశ్వత ఆదాయ మార్గం లేని ఈ కుటుంబానికి మెరుగైన వైద్యం అందించేందుకు అవసరమైన ఖర్చులను భరించే సామర్థ్యం లేదు. ప్రస్తుతం తమ వద్ద ఒక్క రూపాయి కూడా లేక, చిన్నారి ప్రాణాలను కాపాడుకోవాలనే ఆశతో, కనీస వైద్య ఖర్చులకు సహాయం కోరుతున్నారు.

సామాజిక బాధ్యతగా ముందుకు రావాల్సిన సమయం ఇది

చిన్నారి వరుణ్ తేజ్‌కు ప్రాణాపాయ స్థితిలో మెరుగైన వైద్యం అత్యవసరం. అయితే ఆర్థిక వెసులుబాటు లేక కుటుంబం నిస్సహాయంగా సాయం కోసం ఎదురుచూస్తోంది. మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరు తమ చేతనైనంత సహాయం చేయాలని కుటుంబ సభ్యులు ఆవేదనతో కోరుతున్నారు.

సహాయానికి వివరాలు:

📍 లబ్ధిదారుడు: జాడి నవీన్
📱 PhonePe / Google Pay నంబర్: 7032943748
💳 చేతనైన సహాయం: ₹10, ₹50, ₹100, ₹500 లేదా మీకు వీలైనంత

ఒక్క రూపాయి కూడా ప్రాణాన్ని కాపాడే ఆశగా మారవచ్చు…

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!