ఆర్టీసీ బస్సులో గుండెపోటుతో ప్రయాణికుడు మృతి
వైరా సమీపంలో విషాదం
ఖమ్మం,ఆధాబ్ న్యూస్ : ఖమ్మం నుంచి భద్రాచలం వెళ్తున్న డీలక్స్ ఆర్టీసీ బస్సులో సోమవారం ఉదయం విషాద ఘటన చోటుచేసుకుంది. బస్సులో ప్రయాణిస్తున్న సత్యనారాయణ మూర్తి (64) అనూహ్యంగా గుండెపోటుకు గురై అక్కడికక్కడే మృతి చెందారు.
వైరా సమీపంలో బస్సు చేరుకునే సమయంలో ఆయన అస్వస్థతకు గురయ్యారు. విషయం గమనించిన తోటి ప్రయాణికులు వెంటనే CPR (కార్డియోపల్మనరీ రిససిటేషన్) ప్రయత్నం చేసినా ప్రాణాలు కాపాడలేకపోయారు.
మృతుడు ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం చెన్నారం గ్రామానికి చెందిన సొసైటీ సీఈవోగా పనిచేస్తున్న సత్యనారాయణ మూర్తిగా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Post Views: 35









