ప్రతి క్షణం
ప్రజల పక్షం

  ఇల్లందు SHO సస్పెండ్ – ఐజీ చంద్రశేఖర్ రెడ్డి కఠిన చర్య

ఇల్లందు SHO సస్పెండ్ – ఐజీ చంద్రశేఖర్ రెడ్డి కఠిన చర్య

ఇల్లందు, ఆధాబ్ న్యూస్:
భార్యభర్తల మధ్య వ్యక్తిగత వివాదం కేసులో బాధితుడి తల్లిదండ్రులతో దురుసుగా ప్రవర్తించిన ఘటనపై మల్టీ జోన్-1 ఐజీ చంద్రశేఖర్ రెడ్డి (IPS) కఠినంగా స్పందించారు. ఈ సంఘటనపై విచారణ అనంతరం, ఇల్లందు SHO సత్యనారాయణను సస్పెండ్ చేస్తూ ఐజీ ఉత్తర్వులు జారీ చేశారు.

ఒక పోలీసు అధికారిగా ప్రవర్తించవలసిన నీతి, న్యాయం లను అతిక్రమించి బాధిత కుటుంబ హక్కులను ఉల్లంఘించినందుకుగాను ఈ చర్య తీసుకున్నట్టు తెలుస్తోంది.

ఈ సందర్భంగా ఐజీ చంద్రశేఖర్ రెడ్డి IPS పేర్కొంటూ,
ఎటువంటి పోలీసు అధికారి అయినా స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులతో అమర్యాదగా ప్రవర్తిస్తే శాఖాపరంగా కఠిన చర్యలు తప్పవు. పోలీసులు ప్రజలకు రక్షణగా నిలవాలి కాని భయంకరంగా కాకూడదు” అని హెచ్చరించారు.

 

ఈ చర్యతో పోలీస్ శాఖలో క్రమశిక్షణకు ప్రాధాన్యం పెరిగిందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

రిటర్న్ సీడ్ పేరుతో రైతులకు టోకరా.. నట్టేట మునిగిపోతున్న అన్నదాతలు సీడ్ కంపెనీల మోసాలపై జేఏసీ అధ్యక్షుడు గొగ్గల కృష్ణ ఆగ్రహం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి నాసిరకం విత్తనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్