అనంతారం చివరలో ప్రమాదం: టాటా ఏసీ కల్వర్టు కు ఢీ మానవత్వంతో ముందుకొచ్చి ఇద్దరి ప్రాణాలు కాపాడిన యువనేత.
కరకగూడెం, ఆధాబ్ న్యూస్:
కరకగూడెం మండలంలోని అనంతారం గ్రామ చివరలో మంగళవారం నాడు రోడ్డు ప్రమాదం సంభవించింది. TS 04 UD 6541 నంబర్ కలిగిన టాటా ఏసీ వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న కల్వర్టు ఢీకొంది. ప్రమాద సమయంలో వాహనంలో ప్రయాణిస్తున్న డ్రైవర్ ఆకుల సందీప్ 30, కటుకోజుల వరణ్ 20 (నర్సంపేట నియోజకవర్గానికి చెందిన బుధరావుపేట గ్రామ నివాసులు) .
ప్రమాదం జరిగిన క్షణాల్లో అటుగా వెళ్తున్న బీఆర్ఎస్ యూత్ ప్రెసిడెంట్ యువ నేత గుడ్ల రంజిత్ కుమార్ తక్షణమే స్పందించారు. గాయపడిన వారిని తన సొంత ఆటోలో ఎక్కించుకొని సమీపంలోని కరకగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లి వైద్యం చేయించి, ప్రాణాపాయం నుండి కాపాడారు.
ప్రస్తుతం గాయపడ్డ వారి ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై స్థానికులు స్పందిస్తూ, ‘‘ఇప్పటి కాలంలో చాలామంది సమాజంలో ఏదైనా ప్రమాదం జరిగితే మనకెందుకులే అని పక్కనబడిపోతున్నారు. కానీ బీఆర్ఎస్ యువనేత గుడ్ల రంజిత్ కుమార్ మాత్రం మానవత్వాన్ని చాటుతూ, వెంటనే స్పందించి సాయం అందించటం అభినందనీయం,’’ అని కొనియాడారు.
ఈ ఘటన మనందరికీ ఒక మేలుకలగా నిలవాలి. ప్రమాదం జరిగినప్పుడు మన చుట్టూ ఉన్నవారు స్పందించకపోతే ప్రాణాపాయానికి గురవడం తధ్యం. అలాంటి సమయంలో బీఆర్ఎస్ యువనేత గుడ్ల రంజిత్ కుమార్ చూపిన చొరవ, సేవా మనోభావం నిజంగా ప్రశంసనీయం.









