ప్రతి క్షణం
ప్రజల పక్షం

  భూమిలేని కార్మికులకు ‘ఇంద్రమ్మ ఇల్లు – ఆత్మీయ భరోసా’ పథకాన్ని అమలు చేయాలి: సిపిఎం

భూమిలేని కార్మికులకు ‘ఇంద్రమ్మ ఇల్లు – ఆత్మీయ భరోసా’ పథకాన్ని అమలు చేయాలి: సిపిఎం
బూర్గంపాడు,ఆధాబ్ న్యూస్: భూమిలేని వ్యవసాయ కార్మికులకు ఇళ్లను నిర్మించి ఇవ్వాలని, అలాగే అసైన్మెంట్ భూములకు పట్టాలు ఇవ్వాలని సిపిఎం బూర్గంపాడు మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు.

ఒక ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, బిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో అసైన్మెంట్ భూముల్లో అనేక అక్రమాలు జరిగాయని, ఒకరి భూమిని ఇంకొకరికి పట్టాలుగా ఇచ్చిన ఘటనలు నమోదయ్యాయని ఆరోపించారు. ఇటువంటి భూ అన్యాయాల వల్ల భూములు కోల్పోయిన కుటుంబాలకు తిరిగి అసైన్మెంట్ భూములు అందజేసి భూ భారతిలో పట్టాలు ఇవ్వాలని కోరారు.

పోడు సాగు చేస్తున్న గిరిజన రైతులకు అందరికీ పట్టాలు ఇవ్వాలని, గత ప్రభుత్వం ఇచ్చిన పట్టాలు ఉన్నా రైతు బంధు లాంటి ప్రయోజనాలు కొందరికి అందడం లేదని ఆయన చెప్పారు. అడవీ శాఖ అధికారులు బలవంతంగా భూములు లాక్కొని ఆదివాసీలపై కేసులు బనాయించి జైలుకు పంపిన అనేక సంఘటనలు చోటుచేసుకున్నాయని ఆరోపించారు.

ఇందుకు కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి, కేసులు రద్దు చేసి, ఫారెస్ట్ శాఖ వశంలో ఉన్న భూములను గిరిజనులకు తిరిగి అప్పగించాలని డిమాండ్ చేశారు. భూముల వివరాలు భూ భారతిలో నమోదు చేసి రైతు బంధు లబ్ధిని అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 16 నెలలు అయినా ఇప్పటివరకు ప్రతిపాదించిన ‘ఆత్మీయ భరోసా’ పథకం అమలు కాలేదని విమర్శించారు. పేదలందరికీ ఇళ్ల నిర్మాణం కోసం ‘ఇందిరమ్మ ఇల్లు’ పథకం ద్వారా సహాయం చేయాలని కోరారు.

ఇక రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన డిజిటల్ సర్వేను తక్షణమే నిలిపివేయాలని, మండలంలో ఉన్న ప్రభుత్వ భూములను పేద వ్యవసాయ కార్మిక కుటుంబాలకు పంచిపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. నాన్-ట్రైబల్ వ్యక్తుల వద్ద ఉన్న అసైన్మెంట్ భూములను సర్వే చేసి, ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు అప్పగించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని స్పష్టం చేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!