కరకగూడెం పోలీసుల కమ్యూనిటీ కనెక్ట్ ప్రోగ్రాం – ఆదివాసీ యువతకు క్రీడా సామాగ్రి పంపిణీ
కరకగూడెం, ఆధాబ్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు ఏడూల్లా బయ్యారం సీఐ వెంకటేశ్వరరావు, కరకగూడెం ఎస్సై పివిఎన్ రావు, ఆధ్వర్యంలో కరకగూడెం మండలంలోని నిమ్మలగూడెం, నీలాద్రిపేట గండి గుత్తి కోయ వలస ఆదివాసీ గ్రామాల్లో పోలీసుల కమ్యూనిటీ కనెక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆదివాసీ యువతకు వాలీబాల్ కిట్లు, చిన్నారులకు చదువుకునేందుకు పలకలు పంపిణీ చేశారు. సందర్భంగా సీఐ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ
మావోయిస్టలు కాలం చెల్లిన సిద్ధాంతాలు ప్రజలను అభివృద్ధి నుండి దూరం చేస్తున్నాయని, యువత ప్రభుత్వానికి సహకరిస్తూ విద్య, శ్రమద్వారా ఉన్నత స్థానాలను చేరుకోవాలని ఆకాంక్షించారు. మావోయిస్టులకు సహకరించడం వల్ల కేసులు, జైలు శిక్షలు రావచ్చని హెచ్చరించారు.
ప్రజలు చట్టబద్ధంగా జీవించి, అసాంఘీక శక్తులకు తలొగ్గకుండ అభివృద్ధి దిశగా పయనించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఏడుల్ల బయ్యారం సీఐ వెంకటేశ్వరరావు, కరకగూడెం ఎస్ఐ పివిఎన్ రావు, స్పెషల్ పార్టీ టీజీఎస్పీ సిబ్బంది పాల్గొన్నారు.









