గవర్నమెంట్ స్కూల్కు జీవం పోసిన ఆదర్శ ఉపాధ్యాయుడు – హెడ్మాస్టర్ హనుమంతరావు
పినపాక,ఆధాబ్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలంలోని మారుమూల ప్రాంతమైన ఏడుల్లా బయ్యారంలో ఉన్న బిసి రావిగూడెం ఎంపీపీఎస్ స్కూల్కు మార్గదర్శకుడిగా నిలిచాడు ప్రధానోపాధ్యాయుడు రామటెంకి హనుమంతరావు. ప్రభుత్వ పాఠశాలపై ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించేందుకు చేసిన కృషి ఆదర్శంగా నిలుస్తోంది.
ఒకానొక సమయంలో ఐదుగురు విద్యార్థులతో కొనసాగిన ఈ పాఠశాల నేడు 20 మందికి పైగా విద్యార్థులతో నిండిపోయింది. ఈ ఘనత అంతా హనుమంతరావుకే చెందింది. గ్రామ ప్రజలు తమ పిల్లలను ప్రైవేట్ స్కూళ్లలో చేర్పించేందుకు మొగ్గుచూపుతున్న సమయంలో, హనుమంతరావు ఇంటింటి తిరుగుతూ “ప్రైవేట్ స్కూల్ వద్దు, గవర్నమెంట్ స్కూల్ ముద్దు” అనే నినాదంతో వారి మనసు మార్చి, ప్రభుత్వ పాఠశాలపై విశ్వాసాన్ని పెంచాడు.
పిల్లల చదువులో నాణ్యతతో పాటు వారిలో ఆసక్తిని కలిగించేలా పాఠశాలలో పలు చర్యలు చేపట్టి, విద్యార్థుల సంఖ్యను పెంచడమే కాక, వారి భవిష్యత్తుకూ దారి వేసాడు. శ్రద్ధ, కృషికి గుర్తింపుగా గ్రామ ప్రజలు హనుమంతరావును ప్రశంసలతో ముంచెత్తారు.
ఈ రోజు సమాజానికి అవసరమైనది ఇలాంటి ఆదర్శ ఉపాధ్యాయులే









