లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ పంచాయతీ కార్యదర్శి
సంగారెడ్డి ,ఆధాబ్ న్యూస్:
సంగారెడ్డి జిల్లాలో లంచం తీసుకుంటూ ఒక పంచాయతీ కార్యదర్శి ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడింది. మునిపల్లి మండలం, బుధేరా గ్రామ పంచాయతీలో విధులు నిర్వహిస్తున్న పట్లోళ్ల నాగలక్ష్మి అనే కార్యదర్శి, ఓ పౌరుడి నుండి రూ. 8,000/- లంచం తీసుకుంటుండగా (ACB) అధికారులు పట్టుకున్నారు.
లంచం డిమాండ్ చేసిన కారణాలు:
ఫిర్యాదుదారు స్థలంలో వాటర్ సర్వీసింగ్ సెంటర్ షెడ్ ఏర్పాటుకు అనుమతి ఇవ్వడం.
ఫిర్యాదుదారు ఓపెన్ ప్లాట్‌కు కొత్త ఇంటి నంబర్ కేటాయించడం.
ఈ మేరకు బాధితుడు ఏసీబీని ఆశ్రయించగా, అధికారులు పక్కా ప్రణాళికతో దాడి చేసి పట్లోళ్ల నాగలక్ష్మిని లంచం తీసుకుంటున్న సమయంలో పట్టుకున్నారు.
ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి పూర్తి విచారణ కొనసాగుతోంది. ప్రభుత్వ ఉద్యోగుల నుండి లంచం వసూలు చేస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తుండటంతో ప్రజలు నిరాశకు గురవుతున్నారు. అయితే ఇటువంటి దాడుల ద్వారా ప్రభుత్వ శాఖలలో పారదర్శకత పెరుగుతుందని అధికారులు తెలిపారు.









