ప్రతి క్షణం
ప్రజల పక్షం

  ములుగు డీఈవో కార్యాలయంలో ఏసీబీ దాడులు – లంచం తీసుకుంటూ పట్టుబడిన అధికారి పాణిని

ములుగు డీఈవో కార్యాలయంలో ఏసీబీ దాడులు – లంచం తీసుకుంటూ పట్టుబడిన అధికారి పాణిని
ములుగు ఆధాబ్ న్యూస్ :
ములుగు జిల్లా కేంద్రంలోని జిల్లా విద్యాశాఖాధికారుల కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు సోమవారం ఉదయం అకస్మాత్తుగా దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో జిల్లా విద్యా శాఖ అధికారి (డీఈవో) పాణిని, ఆయనతో పాటు మరో సీనియర్ అసిస్టెంట్‌ను ఏసీబీ అధికారులు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

వివరాల్లోకి వెళ్తే… కన్నాయిగూడెం మండలం లక్ష్మీపురంలో పనిచేసే ఓ ఉపాధ్యాయుడు సిక్ లీవ్ పూర్తయ్యాక మళ్లీ పోస్టింగ్ కోసం అధికారులను ఆశ్రయించాడు. అయితే ఈ విషయంలో డీఈవో కార్యాలయ అధికారులు రూ.20,000 లంచం డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. బాధితుడు ఏసీబీకి ఫిర్యాదు చేయగా, వారి సూచన మేరకు నోట్లతో కార్యాలయానికి వెళ్లాడు. నిశితంగా పన్నిన వ్యూహంతో ఏసీబీ అధికారులు రెయిడ్ నిర్వహించి, డీఈవో పాణిని సహా సీనియర్ అసిస్టెంట్‌ను లంచం తీసుకుంటుండగా అదుపులోకి తీసుకున్నారు.

ఈ ఘటన జిల్లాలో సంచలనంగా మారింది. విద్యాశాఖలో అవినీతికి ఇది నిదర్శనమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

రిటర్న్ సీడ్ పేరుతో రైతులకు టోకరా.. నట్టేట మునిగిపోతున్న అన్నదాతలు సీడ్ కంపెనీల మోసాలపై జేఏసీ అధ్యక్షుడు గొగ్గల కృష్ణ ఆగ్రహం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి నాసిరకం విత్తనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్