ప్రతి క్షణం
ప్రజల పక్షం

  సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుడికి ప్రమాద బీమా వర్తించాలి – మధుసూదన్ రెడ్డి డిమాండ్

సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుడికి ప్రమాద బీమా వర్తించాలి – మధుసూదన్ రెడ్డి డిమాండ్
మణుగూరు, ఆధాబ్ న్యూస్:
పిడుగుపాటుకు గురై మృతిచెందిన సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుడు కుంజా జగన్ కు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ద్వారా ప్రమాద బీమా వర్తించాలంటూ ప్రగతిశీల సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ (టీ.యు.సి.ఐ అనుబంధం) రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆర్. మధుసూదన్ రెడ్డి డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మణుగూరు ఏరియాలో సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుడిగా విధులు నిర్వహిస్తున్న కుంజా జగన్ రోజువారీ పనులు ముగించుకొని స్వగ్రామమైన రేగులగండి వెళ్లి, తన పొలంలో పని చేస్తుండగా పిడుగుపాటుకు గురై అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. మృతునికి తండ్రి దేవయ్య, భార్య దేవి, నలుగురు చిన్నపిల్లలు ఉన్నారని, కుటుంబం పూర్తిగా ఆదారాన్ని కోల్పోయి రోడ్డున పడే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.

సింగరేణి సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుతో కలసి కాంట్రాక్ట్ కార్మికుల పే సాలరీ ఖాతాలకు ప్రమాద బీమా సదుపాయం కల్పించిందని, కుంజా జగన్ ఖాతా హెచ్‌డీఎఫ్‌సీలోనే ఉన్నందున బీమా ప్రయోజనాలు వర్తించాలంటూ అధికారులను డిమాండ్ చేశారు.

అలాగే ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం మృతుని కుటుంబానికి తక్షణ సహాయాన్ని అందించాలని కోరారు.

ఈ ఘటనపై మణుగూరు బ్రాంచ్ యూనియన్ అధ్యక్షుడు వి. జానయ్య, కార్యదర్శి పి. సంజీవరెడ్డి, సభ్యులు ప్రసాద్, దేవి, ఇందిర, లక్ష్మయ్య, అశోక్, విజయ్ తదితరులు తీవ్ర సంతాపం తెలిపారు. జగన్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!