ప్రతి క్షణం
ప్రజల పక్షం

  మాగంటి గోపీనాథ్, అహ్మదాబాద్ ప్రమాద బాధితులకు బీఆర్ఎస్ నేతల శ్రద్ధాంజలి

మాగంటి గోపీనాథ్, అహ్మదాబాద్ ప్రమాద బాధితులకు బీఆర్ఎస్ నేతల శ్రద్ధాంజలి

భద్రాద్రి కొత్తగూడెం,ఆధాబ్ న్యూస్: అనారోగ్యంతో చికిత్స పొందుతూ అకాలమరణం చెందిన పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కి మరియు అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన బాధితులకు బీఆర్ఎస్ పార్టీ శ్రద్ధాంజలి ఘటించింది.

శనివారం నాడు బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన మండల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల సమీక్షా సమావేశంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు, కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్లు, అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు, భద్రాచలం ఇంచార్జి రామకృష్ణ, గ్రంథాలయ మాజీ జిల్లా అధ్యక్షుడు దిండిగాల రాజేందర్, కొత్తగూడెం మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ కాపు సీతా మహాలక్ష్మి తదితర నేతలు పాల్గొన్నారు.

అలాగే పార్టీకి సంబంధించిన అన్ని అనుబంధ సంఘాల జిల్లా అధ్యక్షులు, ఐదు నియోజకవర్గాల ముఖ్యనాయకులు, అన్ని మండలాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు ఈ సమావేశంలో హాజరయ్యారు.

ఈ సందర్భంగా మాగంటి గోపీనాథ్  అందించిన సేవలను వారు స్మరించుకుంటూ, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. అలాగే విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలకు బలమైన సహానుభూతి ప్రకటించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

రిటర్న్ సీడ్ పేరుతో రైతులకు టోకరా.. నట్టేట మునిగిపోతున్న అన్నదాతలు సీడ్ కంపెనీల మోసాలపై జేఏసీ అధ్యక్షుడు గొగ్గల కృష్ణ ఆగ్రహం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి నాసిరకం విత్తనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్