భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు గౌరవం — ముగ్గురు బీసీలకు పీసీసీ ప్రధాన కార్యదర్శుల పదవులు
భద్రాద్రి కొత్తగూడెం,ఆధాబ్ న్యూస్:
పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో, నూతనంగా పీసీసీ ప్రధాన కార్యదర్శులుగా నియమితులైన నల్లపు దుర్గాప్రసాద్, మోతుకూరి ధర్మారావు, నాగ సీతారాములకు ఘనంగా అభినందన సభ నిర్వహించారు. ఈ కార్యక్ర స్థానిక కాంగ్రెస్ కార్యాలయంలో నిర్వహించబడింది.
ఈ సభకు అధ్యక్షత వహించిన ఓబీసీ సెల్ జిల్లా చైర్మన్ అల్లాడి నరసింహారావు పార్టీకి వఫాదారిగా పని చేసిన వారికి గుర్తింపు దక్కడం హర్షణీయమన్నారు.
టీపీసీసీ సభ్యులు జేబీ శౌరి మాట్లాడుతూ:
భద్రాచలం నుంచి నల్లపు దుర్గాప్రసాద్ , కొత్తగూడెం నుంచి సీనియర్ నేత మోతుకూరి ధర్మారావు , సుజాతనగర్ నుంచి నాగ సీతారాములు గార్లను పీసీసీ ప్రధాన కార్యదర్శులుగా నియమించడం కాంగ్రెస్ పార్టీలో బీసీలకు న్యాయం జరిగిందని చాటుతుంది.”
అలాగే నియామకాల్లో కీలక పాత్ర పోషించిన జిల్లా అధ్యక్షులు పొదేం వీరయ్య, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావుకు కృతజ్ఞతలు తెలిపారు.
పార్టీ బలోపేతానికి పిలుపు
నూతన ప్రధాన కార్యదర్శులు పార్టీలో పాతవారిని, కొత్తవారిని సమన్వయం చేసుకుని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయాన్ని సాధించేందుకు పని చేయాలని కోరారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్, మున్సిపల్ కౌన్సిలర్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపుకు కృషి చేయాలని సూచించారు.
పాల్గొన్న ముఖ్యులు:
కిసాన్ సెల్ జిల్లా చైర్మన్ ఏలూరు కోటేశ్వరరావు
యువజన కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు గడ్డం రాజశేఖర్
NSUI జిల్లా అధ్యక్షుడు అజ్మీర సురేష్ నాయక్
పట్టణ కన్వీనర్ మహమ్మద్ గౌస్
మాజీ కౌన్సిలర్లు తంగేళ్ల లక్ష్మణ్, పల్లపు లక్ష్మణ్
గరిపేట ఎంపీటీసీ కసనబోయిన భద్రం
ఓబీసీ సెల్ పట్టణ చైర్మన్ జయప్రకాష్
పట్టణ ఉపాధ్యక్షులు ఉస్మాన్ అలీ, మైనార్టీ సెల్ నేతలు ఎస్.కె నయీమ్, మంద సాయి తదితరులు పాల్గొన్నారు.









