ప్రతి క్షణం
ప్రజల పక్షం

  ప్రైవేట్ స్కూళ్ల ఫీజుల మోతకు చెక్ పెట్టండి! పుస్తకాలు, యూనిఫాంల పేరుతో వసూళ్ల దోపిడీ ఆపండి!

ప్రైవేట్ స్కూళ్ల ఫీజుల మోతకు చెక్ పెట్టండి!

పుస్తకాలు, యూనిఫాంల పేరుతో వసూళ్ల దోపిడీ ఆపండి!

తగిన మౌలిక సదుపాయాలు, అనుభవజ్ఞ టీచర్లు తప్పనిసరి

మే నెలలో విస్తృత ప్రచారం చేసిన ఉపాధ్యాయులకు జీతాలే లేకపోవడం గమనార్హం

మణుగూరు,ఆధాబ్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు సబ్ డివిజన్‌లోని ప్రైవేట్ పాఠశాలల ఫీజుల దోపిడీని అరికట్టాలని సామాజిక సేవకులు కర్నె బాబురావు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన గురువారం మండల విద్యాశాఖ అధికారిణి స్వర్ణజ్యోతికి మెమోరాండం సమర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ –
“తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు కోసం ప్రైవేట్ స్కూళ్లను ఆశ్రయిస్తే, చదువుకునే రోజులు పోయి చదువు కొనే రోజులు వచ్చాయి. బడి తలుపులు తెరిచే సమయానికి ఫీజుల భారం తల్లిదండ్రులను గుబురుపెడుతోంది,” అని ఆవేదన వ్యక్తం చేశారు.

ఫీజులు మాత్రమే కాకుండా పుస్తకాలు, యూనిఫారాల పేరుతో అదనపు బరువు వేస్తున్న ప్రైవేట్ పాఠశాలలు, ట్రాన్స్‌పోర్ట్ ఫీజులూ అధికంగా వసూలు చేస్తున్నాయని ఆరోపించారు. పేరున్న స్కూల్లలో 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు ఒక్కో విద్యార్థికి రూ. 50,000 నుండి రూ. 80,000 వరకు ఫీజులు వసూలు చేస్తున్నాయని పేర్కొన్నారు.

ఇంకా ముఖ్యాంశాలు:

స్కూల్ బుక్స్, యూనిఫారాలు తప్పనిసరిగా స్కూల్ నుంచే కొనాలని ఒత్తిడి.

సరైన అర్హతలు లేని టీచర్లతో బోధన కొనసాగుతుంది.

మే నెలలో ప్రచారం కోసం ఉపాధ్యాయుల్ని వాడుకుంటూ జీతాలు ఇవ్వకపోవడం అన్యాయం.
గత ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు, ఇప్పుడు తక్షణమే చొరవ అవసరం.
బాబురావు విజ్ఞప్తి చేస్తూ చెప్పారు –
“తక్షణమే విద్యాశాఖ అధికారులు స్పందించి, అధిక ఫీజులు వసూలు చేసే స్కూళ్లపై చర్యలు తీసుకోవాలి. జిల్లా విద్యాశాఖాధికారి, మంత్రి గారికి సమగ్ర ఫిర్యాదు చేయడం తప్పదని స్పష్టం చేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

రిటర్న్ సీడ్ పేరుతో రైతులకు టోకరా.. నట్టేట మునిగిపోతున్న అన్నదాతలు సీడ్ కంపెనీల మోసాలపై జేఏసీ అధ్యక్షుడు గొగ్గల కృష్ణ ఆగ్రహం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి నాసిరకం విత్తనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్