ప్రతి క్షణం
ప్రజల పక్షం

  బాల కార్మికులను గుర్తించండి, పాఠశాలల్లో చేర్పించండి: అదనపు కలెక్టర్ వేణుగోపాల్ పిలుపు.

భద్రాద్రి కొత్తగూడెం ,ఆధాబ్ న్యూస్: భద్రాద్రి కొత్తగూడెం
జిల్లాలో ఒక్క బాలుడైనా పని ప్రదేశంలో మిగిలిపోకూడదని, వారందరినీ పాఠశాలల్లో చేర్పించాలని జిల్లా అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్ స్పష్టం చేశారు.
బుధవారం ఆయన తన కార్యాలయంలో జూన్ 12: ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా యాక్షన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ (ఎయిడ్) సంస్థ రూపొందించిన గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన, “విద్యా సంవత్సరం ప్రారంభమైన ఈ సమయంలో ప్రతి బాలుడిని బడిలో చేరేలా చూడాలి. పిల్లలను పనిలో పెట్టుకోవడం చట్టరీత్యా నేరం. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం” అని హెచ్చరించారు.

బడిబాట కార్యక్రమం ప్రారంభమైన నేపథ్యంలో, ప్రతి పౌరుడు, తల్లిదండ్రులు, అధికారులు కలిసి 100% విద్యార్థుల నమోదు జరగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!