ప్రతి క్షణం
ప్రజల పక్షం

  లబ్దిదారునికి CMRF చెక్కును అందజేసిన పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు.

లబ్దిదారునికి CMRF చెక్కును అందజేసిన పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు.
మణుగూరు,ఆధాబ్ న్యూస్:
పినపాక నియోజకవర్గ శాసన సభ్యుడు పాయం వెంకటేశ్వర్లు మణుగూరు మండలంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో, పినపాక మండలం దుగినేపల్లి గ్రామానికి చెందిన అల్లి నరేష్ కు ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) నుండి మంజూరైన చెక్కును అందజేశారు.

ఈ కార్యక్రమం మణుగూరు మండలంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జరిగింది. లబ్దిదారుని వైద్య ఖర్చుల నిమిత్తంగా ప్రభుత్వం నుండి మంజూరైన ఆర్థిక సాయాన్ని చెక్కు రూపంలో అందజేస్తూ, ప్రభుత్వ ప్రజానంక్షేమ విధానాలను ప్రజలకు చేరవేయడమే తన ప్రధాన లక్ష్యమని పాయం వెంకటేశ్వర్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

పదవిలోకి వచ్చిన తరువాత నుంచి పాయం వెంకటేశ్వర్లు అభివృద్ధి పనులకు పాటు ప్రజలకు నేరుగా ఉపయోగపడే పథకాల అమలులో కూడా చురుకుగా ఉన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

రిటర్న్ సీడ్ పేరుతో రైతులకు టోకరా.. నట్టేట మునిగిపోతున్న అన్నదాతలు సీడ్ కంపెనీల మోసాలపై జేఏసీ అధ్యక్షుడు గొగ్గల కృష్ణ ఆగ్రహం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి నాసిరకం విత్తనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్