ప్రతి క్షణం
ప్రజల పక్షం

  ఇందిరమ్మ ఇండ్లకు ముగ్గు వేస్తున్న పంచాయతీ సెక్రటరీ – పినపాకలో కార్యక్రమం

ఇందిరమ్మ ఇండ్లకు ముగ్గు వేస్తున్న పంచాయతీ సెక్రటరీ – పినపాకలో కార్యక్రమం

పినపాక, ఆధాబ్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలంలోని జానంపేట గ్రామ పంచాయతీలో గురువారం రోజు ప్రత్యేక కార్యక్రమం జరిగింది. గ్రామ పంచాయతీ సెక్రటరీ ఎస్కే కాజా హుస్సేన్ ఆధ్వర్యంలో, ఇంద్రమ్మ కమిటీ సమన్వయంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్లకు ముగ్గు వేయడం కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా సెక్రటరీ కాజా హుస్సేన్ మాట్లాడుతూ, ప్రతి ఒక్క లబ్ధిదారుడు ఇందిరమ్మ ఇంటిని నియమిత పరిమితుల్లోనే నిర్మించుకోవాలని సూచించారు. ఇళ్లు 4 చదరపు అడుగుల స్థలంలో మొదలై, గరిష్టంగా 600 చదరపు అడుగులకు మించకూడదని తెలిపారు. నిర్మాణ పనులు పూర్తిగా పంచాయతీ పర్యవేక్షణలో జరిగేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ఇంద్రమ్మ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. గ్రామంలో సంక్షేమ కార్యక్రమాల పట్ల ప్రభుత్వం తీసుకుంటున్న తపనకు ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!