ప్రతి క్షణం
ప్రజల పక్షం

  కణితి సతీష్ హత్య కేసు – ప్రధాన నిందితుడు అరెస్ట్

కణితి సతీష్ హత్య కేసు – ప్రధాన నిందితుడు అరెస్ట్
భద్రాచలం,ఆధాబ్ న్యూస్:
భద్రాచలంలో జూన్ 7న జరిగిన కణితి సతీష్ హత్య కేసులో ప్రధాన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసును అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ విక్రాంత్ కుమార్ సింగ్ (IPS) స్వయంగా పర్యవేక్షిస్తూ, నిందితులను పట్టుకునేందుకు మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.

ఈ క్రమంలో ప్రధాన నిందితుడైన గుంజ సాయిరాం అనే వ్యక్తిని జూన్ 9న భద్రాచలం పోలీసు సిబ్బంది పట్టుకున్నారు. అరెస్ట్ చేసిన అనంతరం అతడిని భద్రాచలం ప్రధమ శ్రేణి మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. మిగిలిన నిందితుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు.
ఈ కేసు విచారణలో కీలక పాత్ర పోషించిన టౌన్ ఇన్‌స్పెక్టర్ ఎం. నాగరాజు, ఎస్‌ఐలు స్వప్న, సతీష్, రామకృష్ణ లు మరియు వారి సిబ్బందిని ఏఎస్పీ అభినందించారు.

అరెస్ట్ చేసిన నిందితుడి వివరాలు ఇలా ఉన్నాయి:
🔹 పేరు: గుంజ సాయిరాం
🔹 తండ్రి పేరు: ఏడుకొండలు
🔹 వయస్సు: 32 సంవత్సరాలు
🔹 కులం: వడ్డెర
🔹 వృత్తి: కూలీ
🔹 నివాసం: జగదీష్ కాలనీ, భద్రాచలం

పోలీసు శాఖ మిగిలిన నిందితులను త్వరలోనే పట్టుకుంటామని నమ్మకంగా తెలిపింది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!