ప్రతి క్షణం
ప్రజల పక్షం

  వేపలగడ్డలో రాష్ట్ర స్థాయి బ్యాట్మింటన్ ఛాంపియన్‌షిప్‌ పోటీలకు ఘన ప్రారంభం

వేపలగడ్డలో రాష్ట్ర స్థాయి బ్యాట్మింటన్ ఛాంపియన్‌షిప్‌ పోటీలకు ఘన ప్రారంభం

వేపలగడ్డ,ఆధాబ్,న్యూస్: వేపలగడ్డలోని వివిన్ ఇండోర్ స్టేడియంలో రాష్ట్ర స్థాయి బ్యాట్మింటన్ ఛాంపియన్‌షిప్‌ పోటీలకు ఘనంగా ప్రారంభం జరిగింది. టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు టాస్ వేసి పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత క్రీడలవైపు ఆకర్షితులై ఆరోగ్యాన్ని, ప్రతిభను పెంపొందించుకోవాలన్నారు.

ఈ పోటీల్లో ప్రత్యేక ఆకర్షణగా ఐటీడీఏ పీఓ రాహుల్ పాల్గొని క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ క్రీడలు విద్యతోపాటు వ్యక్తిత్వ వికాసానికి దోహదపడతాయని తెలిపారు. క్రీడాకారుల్లో నూతన ఉత్సాహాన్ని నింపారు.

ఈ కార్యక్రమంలో ఛాంపియన్‌షిప్‌ ప్రెసిడెంట్ రవి కుమార్, జనరల్ సెక్రటరీ డాక్టర్ సావిత్రి, ట్రెజరర్ కె. రమేష్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రం నలుమూలల నుండి క్రీడాకారులు హాజరై పోటీల్లో తమ ప్రతిభను చాటుతున్నారు.

పోటీలు మూడు రోజుల పాటు కొనసాగనున్నాయని నిర్వాహకులు తెలిపారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!