ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాల పంపిణీ
కరకగూడెం,ఆధాబ్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం గ్రామపంచాయతీ ఆఫీస్ నందు, ప్రత్యేక అధికారి కుమార్ ఆధ్వర్యంలో ఇందిరమ్మ ఇండ్ల మొదటి జాబితాకు చెందిన లబ్ధిదారులకు మంజూరు పత్రాలు పంపిణీ చేయడం జరిగింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం గృహ అవసరాలతో బాధపడుతున్న పేద కుటుంబాలను గుర్తించి, అర్హులైన వారికి ఇళ్లు అందించేందుకు కృషి చేస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలు గ్రామాల నుండి వచ్చిన లబ్ధిదారులు పాల్గొన్నారు. మంజూరు పత్రాల అందుకోవడంతో వారు హర్షం వ్యక్తం చేశారు.
ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు. ఈ కార్యక్రమంలో కరకగూడెం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఇక్బాల్ హుస్సేన్ , పాల్గొన్నారు. ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించిన గ్రామపంచాయతీ సిబ్బందికి స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.









