ప్రతి క్షణం
ప్రజల పక్షం

  తన్నీరు హరీష్ రావు పుట్టినరోజు వేడుకలు ఘనంగా – బీఆర్ఎస్ శ్రేణుల ప్రత్యేక పూజా కార్యక్రమాలు

తన్నీరు హరీష్ రావు పుట్టినరోజు వేడుకలు ఘనంగా – బీఆర్ఎస్ శ్రేణుల ప్రత్యేక పూజా కార్యక్రమాలు
హైదరాబాద్,ఆధాబ్ న్యూస్:
తెలంగాణ ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించిన మాజీ మంత్రి మరియు సిద్దిపేట శాసనసభ్యులు తన్నీరు హరీష్ రావు పుట్టినరోజును పురస్కరించుకొని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పలు ప్రాంతాల్లో ఘనంగా వేడుకలు నిర్వహించాయి.
మహబూబాబాద్ రోడ్డులోని సువర్చల సహిత అభయాంజనేయ స్వామి ఆలయంలో హరీష్ రావు పేరుతో ప్రత్యేక అర్చనలు, పూజలు నిర్వహించడంతో కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణ కలిగింది. ఆయురారోగ్యాలతో కొనసాగాలని, భవిష్యత్‌లో మరిన్ని బాధ్యతలు చేపట్టి రాష్ట్రానికి సేవలందించాలని అభిమాని వర్గాలు ఆకాంక్షించాయి.

ఈ కార్యక్రమాన్ని హరీష్ రావు వీరాభిమాని, ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ అజ్మీరా బావ్ సింగ్ నాయక్ మరియు బీఆర్ఎస్ ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యవస్థాపక సభ్యుడు దిండిగాల రాజేందర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. అనంతరం జగదాంబ సెంటర్ వద్ద తెలంగాణ తల్లి విగ్రహానికి పుష్పాంజలి అర్పించి, శుభాకాంక్షలు తెలిపారు.

పాల్గొన్న ప్రముఖులు:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సీనియర్ నాయకులు సిలివేరి సత్యనారాయణ, 11వ వార్డు మాజీ కౌన్సిలర్ జె.కె. శ్రీను, TBGKS నాయకులు ఎస్. రంగనాథ్, తోట లలిత సరద (మాజీ కౌన్సిలర్), ఇల్లందు పట్టణ ఉపాధ్యక్షుడు అబ్దుల్ నబీ, మహమ్మద్ అబ్దుల్ జబ్బార్, గిన్నారపు రాజేష్, సాతల హరికృష్ణ, కాసాని హరిప్రసాద్ యాదవ్, మునిగంటి శివ, కడంగంచి వీరస్వామి, ఎస్.కె చాంద్ పాషా, లలిత్ కుమార్ పాసి, రామ్ లాల్ పాసి, అజ్మీర నరేష్, గుగులోతు సోమన్న, భూక్య నందు, బోడ రమేష్, గుగులోత్ శ్రీనివాసు, మాలోత్ రాము, అజ్మీర రాందాస్, భూక్య శ్రీను, ధరావత్ రమేష్, నెమలి నిఖిల్, ములుగుండు ఉపేందర్, ఈదుల ముత్తయ్య, బజారు సత్యనారాయణ, వార రమేష్, ఎస్.కె ఇమ్రాన్, పూర్ణాచారి, వీరబాబు, చిన్నారి తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!