రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని జాతీయ పతాకావిష్కరణ
వికారాబాద్, ఆధాబ్ న్యూస్:
రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని వికారాబాద్‌లోని ఐడిఓసి (IDOC) కార్యాలయంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్ర అభివృద్ధిలో ప్రతి ఒక్కరి పాత్ర కీలకమని పేర్కొన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడంలో అధికారులు, సిబ్బంది ప్రతిష్టాత్మకంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు, పోలీసు అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Post Views: 28









