కరకగూడెంలో నూతన తాసిల్దార్ వట్టం కాంతయ్యకు టిడిపి నాయకులు ఘన సన్మానం
కరకగూడెం,ఆధాబ్ న్యూస్: ఇంచార్జ్ తాసిల్దారుగా పదవి బాధ్యతలు స్వీకరించిన వట్టం కాంతయ్య కరకగూడెం తేలుగుదేశం పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, కమలాకర్, పాయం లక్ష్మీనారాయణ మరియు కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొని ఆయనకు పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా తాసిల్దార్ వట్టం కాంతయ్య మాట్లాడుతూ, “ప్రజల సమస్యలకు త్వరిత పరిష్కారం కల్పిస్తూ పారదర్శకంగా పరిపాలనను కొనసాగిస్తాను,” అని హామీ ఇచ్చారు. ప్రజలకు న్యాయం చేయడం తన ముఖ్య లక్ష్యమని పేర్కొన్నారు.
Post Views: 41









