ప్రతి క్షణం
ప్రజల పక్షం

  తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరణ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు.

తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరణ
జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు.
భద్రాద్రికొత్తగూడెం,ఆధాబ్ న్యూస్: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని కొత్తగూడెంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రేగా కాంతారావు జాతీయ జెండాను ఆవిష్కరించారు.

కార్యక్రమంలో పలువురు పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్ర సాధనలో బీఆర్ఎస్ పార్టీ పోషించిన కీలక పాత్రను గుర్తు చేస్తూ రేగా కాంతారావు మాట్లాడుతూ, “తెలంగాణను బంగారు తెలంగాణగా తీర్చిదిద్దేందుకు తిరిగి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉంది. గత పదేళ్లలో అమలైన అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజలకు మేలు చేశాయి” అని తెలిపారు.

వేడుకల్లో జాతీయ గీతాలాపన, నాయకుల సందేశాలు, పార్టీ పాటలతో కార్యకర్తల్లో ఉత్సాహం నెలకొంది. అనంతరం మిఠాయిలు పంచి రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు దిండిగాల రాజేందర్ ,మాజీ ఎమ్మెల్యేలు హరిప్రియ నాయక్ , వనమా వెంకటేశ్వరరావు, మెచ్చ నాగేశ్వరరావు పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!