ప్రతి క్షణం
ప్రజల పక్షం

  తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహణ

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహణ
ములకలపల్లి, ఆధాబ్ న్యూస్: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ములకలపల్లి గ్రామంలో BRS పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండల BRS అధ్యక్షులు మోరంపూడి అప్పారావు, మాజీ జడ్పీటీసీ సున్నం నాగమణి, మాజీ ఎంపీపీ మట్ల నాగమణి ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు.

వారి సారథ్యంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం జాతీయ జెండా మరియు BRS పార్టీ జెండాను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా మోరంపూడి అప్పారావు మాట్లాడుతూ, “తెలంగాణను బంగారు తెలంగాణగా తీర్చిదిద్దే దిశగా BRS పార్టీ పదేళ్ల పాలనలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు అమలయ్యాయి. అయితే మాయ మాటలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి దిశ నుండి వ్యతిరేక దిశగా నడిపిస్తోంది. రాష్ట్ర భవిష్యత్‌కు గులాబీ జెండానే శ్రీరామరక్ష” అని పేర్కొన్నారు. మరో మూడేళ్లలో మళ్లీ BRS అధికారంలోకి రావడం ఖాయం అనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.

ఈ వేడుకలో EX సర్పంచ్ వాడే నాగరాజు, పుష్పాల చందర్ రావు, బండి కొమరయ్య, సున్నం సత్యనారాయణ, గడ్డం నాథనియేల్, పలగాని చిన్నకేశవులు, సున్నం బాబురావు, పూరేటి నర్సింహా రావు, పుష్పాల హనుమంతు, తానం కృష్ణ, తాటి రవి, కోండ్రు సుందర్ రావు, సూరం పుల్లారావు, పొక్కిలి రాజు, పత్తి బిక్షం, పుష్పాల సాయి, దార పోతురాజు, మీడియం మహేష్, బొర్రా రవి, కాంపాటి షోందు, తాళ్ల శ్రీను, సిద్దెల వెంకటేష్, సురేష్, వేముల సతీష్, గడ్డం బాబురావు, యేసుపాక వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

వాతావరణం సాంస్కృతిక హరివిలాసంగా, జెండా ఆవిష్కరణ, నాయకుల ప్రసంగాలు, పల్లె అభివృద్ధి మీద చర్చలతో కార్యక్రమం ఉత్సాహంగా కొనసాగింది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!