ప్రతి క్షణం
ప్రజల పక్షం

  తెలంగాణ రాష్ట్ర అవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ

తెలంగాణ రాష్ట్ర అవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ
కరకగూడెం, ఆధాబ్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర అవిర్భావ దినోత్సవ వేడుకలు అత్యంత భవ్యంగా జరగాయి. ఈ కార్యక్రమాన్ని పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకు మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు.

వేడుకల సందర్భంగా మండల కాంగ్రెస్ అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర 12వ అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.

అయన మాట్లాడుతూ, “తెలంగాణ ఇచ్చిన, తెచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ” అని పేర్కొన్నారు. నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష మేరకు తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడంలో కీలక పాత్ర పోషించిన తల్లి తెలంగాణ ప్రధాత శ్రీమతి సోనియా గాంధీ కు కృతజ్ఞతలు తెలియజేశారు. స్వరాష్ట్రం కోసం తన జీవితాలను అర్పించిన విద్యార్థుల త్యాగాలను, అమరవీరుల బలిదానాలను ఈ సందర్భంగా గుర్తు చేశారు. వారి కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా నిలబడుతుందన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు, నియోజకవర్గ నాయకురాలు పోలేబోయిన శ్రీవాణి తిరుపతయ్య, మాజీ ఉపసర్పంచ్ కోరం వెంకటేశ్వర్లు, మండల కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు నాగబండి వెంకటేశ్వర్లు, మండల నాయకులు ఎర్ర సురేష్, జలగం కృష్ణ, వట్టం చుక్కయ్య, గొగ్గలీ రవి, ఎర్ర సత్యం, సిద్ది వెంకన్న, దంచనాల రాజేంద్రప్రసాద్, గాంధర్ల రామనాథం, ముదురుకోళ్ల వెంకన్న, దుర్గం కన్నయ్య, అశ్రపునిస తదితరులు, కార్యకర్తలు, మహిళలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ఈ కార్యక్రమం వాతావరణాన్ని ఉల్లాసభరితంగా మార్చింది. రాష్ట్ర అభివృద్ధి పట్ల కాంగ్రెస్ పార్టీ సంకల్పబద్ధతను ఈ వేడుకలు ప్రతిబింబించాయి.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!