ములుగు జిల్లాలో మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ – 8మంది నక్సల్స్ లొంగింపు
ములుగు,ఆధాబ్ న్యూస్:
ములుగు జిల్లాలో మావోయిస్టు ఉద్యమానికి మరోసారి తీవ్ర ఎదురుదెబ్బ తగిలింది. దామోదర్ దళానికి చెందిన ప్లాటూన్ స్కాడ్ పార్టీకి చెందిన ఎనిమిది మంది నక్సలైట్లు జిల్లా ఎస్పీ శబరిష్ ఎదుట లొంగిపోయారు.
తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న పునరావాస పథకాలపై అవగాహన పెరగడంతో హింసను వదిలి, సాధారణ జీవనంలోకి రావాలని వీరు నిర్ణయించుకున్నారు. లొంగుబాటు అనంతరం వీరికి ప్రభుత్వ మద్దతు, పునరావాస సహాయాలు లభిస్తాయని ఎస్పీ తెలిపారు.
ఈ నేపథ్యంలో రాష్ట్రంలో శాంతి స్థాపన దిశగా ఇది మరో ముందడుగుగా భావిస్తున్నారు అధికారులు.
Post Views: 47









