ఏసీబీ డీఎస్పీ రమేష్‌కు డీజీపీ విజయ్ కుమార్ చేతుల మీదుగా నగదు బహుమతి
భద్రాద్రి కొత్తగూడెం,ఆధాబ్ న్యూస్: ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలలో అవినీతిపరులపై దాడులు చేస్తూ అత్యధిక కేసుల్లో అరెస్టులు చేసిన ఏసీబీ డీఎస్పీ వై. రమేష్ కి విశేష గౌరవం లభించింది. అవినీతి నిరోధన చర్యల్లో తన విశిష్ట సేవలకు గుర్తింపుగా ఏసీబీ డీజీపీ విజయ్‌కుమార్ ఆయనకు నగదు రివార్డ్‌ను అందజేశారు.
ఉమ్మడి జిల్లాలో అవినీతి నివారణకు రమేష్ చేసిన కృషిని ప్రశంసిస్తూ, ఇతర అధికారులకు ఆదర్శంగా నిలిచేలా ఈ గుర్తింపు ఇచ్చినట్లు ఏసీబీ ఉన్నతాధికారులు పేర్కొన్నారు.
Post Views: 28









