ప్రతి క్షణం
ప్రజల పక్షం

  ఇక జూలైలోనే ‘స్థానిక’ సమరం! ఎన్నికలకు రంగం సిద్ధం – జూన్‌ చివర్లో నోటిఫికేషన్, ఆగస్టు రెండో వారం నాటికి ప్రక్రియ ముగింపు లక్ష్యం

ఇక జూలైలోనే ‘స్థానిక’ సమరం!
ఎన్నికలకు రంగం సిద్ధం – జూన్‌ చివర్లో నోటిఫికేషన్, ఆగస్టు రెండో వారం నాటికి ప్రక్రియ ముగింపు లక్ష్యం

హైదరాబాద్‌, ఆధాబ్ న్యూస్:
తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. గ్రామ పంచాయతీలు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మునిసిపాలిటీలకు జూలైలోనే ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. ఈ మేరకు ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయి.

అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం, ఎన్నికల నోటిఫికేషన్‌ను జూన్‌ చివరివారంలో విడుదల చేయాలని ప్రభుత్వ యంత్రాంగం యోచిస్తోంది. ఆగస్టు రెండో వారం నాటికి పూర్తిగా ఎన్నికల ప్రక్రియను ముగించేలా తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు మౌఖికంగా ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం.

ఇప్పటికే ఓటర్ల జాబితా, వార్డుల విభజన, పోలింగ్‌ కేంద్రాల గుర్తింపు వంటి కీలక ప్రక్రియలు పూర్తికావచ్చినట్టుగా తెలుస్తోంది. ఇవన్నీ ఒక కొలిక్కి వచ్చాయని సమాచారం. త్వరలో వీటిపై అధికారుల సమీక్ష కూడా నిర్వహించనున్నారు.

గ్రామ పంచాయతీలకే మొదట ప్రాధాన్యం!

స్థానిక సంస్థలలో తొలి దశగా గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం దృష్టి పెట్టినట్టు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా 12,633 పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో కలిపి సుమారు 1,13,500 కుపైగా వార్డులు ఉండనున్నాయి.

మునిసిపాలిటీల్లో విలీనం అయిన గ్రామ పంచాయతీలను మినహాయిస్తూ మిగతా అన్ని పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. అలాగే, 5,817 ఎంపీటీసీ, 567 ఎంపీపీ, 567 జడ్పీటీసీ స్థానాలకు కూడా ఓటింగ్ జరగనుంది.

హైదరాబాద్‌, మేడ్చల్‌-మల్కాజిగిరి మినహా మిగతా 31 జిల్లాల్లో జడ్పీ చైర్మన్లను ప్రజలు ఎన్నుకునే అవకాశముంది.

ఈసారి ఎన్నికలు రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా మారనున్న నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలూ సీరియస్‌గా తీసుకుంటున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల పట్ల ప్రజల్లోనూ ఉత్సాహం కనిపిస్తోంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

రిటర్న్ సీడ్ పేరుతో రైతులకు టోకరా.. నట్టేట మునిగిపోతున్న అన్నదాతలు సీడ్ కంపెనీల మోసాలపై జేఏసీ అధ్యక్షుడు గొగ్గల కృష్ణ ఆగ్రహం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి నాసిరకం విత్తనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్