ప్రతి క్షణం
ప్రజల పక్షం

  లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన గ్రామ పంచాయతీ కార్యదర్శి

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన గ్రామ పంచాయతీ కార్యదర్శి
నిజామాబాద్, ఆధాబ్ న్యూస్:
నిజామాబాద్ జిల్లా, మక్లూర్ మండలం పరిధిలోని గొట్టుముక్కుల గ్రామంలో అవినీతి కేసు వెలుగులోకి వచ్చింది. ఫిర్యాదుదారుని ఇంటికి ఇంటి నంబర్ కేటాయించడం, బహిరంగ స్థలానికి అసెస్‌మెంట్ నంబర్లు మంజూరు చేయడం వంటి పనుల్లో నిబంధనలను ఉల్లంఘిస్తూ, గ్రామ పంచాయతీ కార్యదర్శి కట్కం గంగ మోహన్ రూ.20,000 లంచం డిమాండ్ చేసినట్టు ఆరోపణలు వెల్లడి అయ్యాయి.

ఫిర్యాదుదారుడి సూచనపై లంచం మొత్తాన్ని రూ.18,000కి తగ్గించి తీసుకుంటున్న సమయంలో, తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారుల బారిన పడ్డారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు, మరింత దర్యాప్తు చేపట్టారు.

ఈ సంఘటన, రాష్ట్రవ్యాప్తంగా అవినీతి వ్యతిరేక చర్యల్లో మరో కీలక ఘట్టంగా నిలిచిందని అధికారులు పేర్కొన్నారు. ప్రభుత్వ వ్యవస్థలో పారదర్శకతను కల్పించేందుకు ఇలాంటి చర్యలు అవసరమని వారు వెల్లడించారు.

ప్రజలకు విజ్ఞప్తి: ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి లంచం డిమాండ్ చేస్తే, వెంటనే తెలంగాణ అవినీతి నిరోధక శాఖను సంప్రదించండి. ఫిర్యాదులు నమోదు చేయడానికి టోల్ ఫ్రీ నంబర్ 1064, వాట్సాప్ 9440446106, ఫేస్‌బుక్ (@TelanganaACB), ఎక్స్ / ట్విట్టర్ (@TelanganaACB), లేదా అధికారిక వెబ్‌సైట్ acb.telangana.gov.in ద్వారా సంప్రదించవచ్చు. ఫిర్యాదుదారుల వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయి.

అవినీతి నిర్మూలనలో ప్రతి పౌరుడు భాగస్వామ్యమవ్వాలి.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

రిటర్న్ సీడ్ పేరుతో రైతులకు టోకరా.. నట్టేట మునిగిపోతున్న అన్నదాతలు సీడ్ కంపెనీల మోసాలపై జేఏసీ అధ్యక్షుడు గొగ్గల కృష్ణ ఆగ్రహం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి నాసిరకం విత్తనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్