ప్రతి క్షణం
ప్రజల పక్షం

  జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం – నారా లోకేష్ ఆధ్వర్యంలో విశాఖలో భారీ ఏర్పాట్లు.

జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం – నారా లోకేష్ ఆధ్వర్యంలో విశాఖలో భారీ ఏర్పాట్లు.

విశాఖపట్నం, ఆధాబ్ న్యూస్: జూన్ 21న జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని విశాఖలో అధికారులతో మంత్రి మండలి బృందం సమీక్షా సమావేశం నిర్వహించింది. ఈ సమావేశం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో జరిగింది. యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లపై నారా లోకేష్ సమీక్ష నిర్వహించారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉన్నందున, అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని నారా లోకేష్ ఆదేశించారు. ప్రధాని పర్యటన రాష్ట్రానికి గర్వకారణంగా మారేలా అధికారులు తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు.

విశాఖపట్నంలో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విద్యా సంస్థలతో పాటు ప్రజలందరినీ చైతన్యపరిచేలా కార్యక్రమాలు చేపట్టాలని నారా లోకేష్ తెలిపారు. 26 జిల్లాల్లో 26 రోజుల పాటు యోగా కార్యక్రమాలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!