ప్రతి క్షణం
ప్రజల పక్షం

  పాములపల్లిలో పేకాట దందా – 10 మంది అరెస్టు, రూ.20వేల నగదు, 9 సెల్‌ఫోన్లు స్వాధీనం

పాములపల్లిలో పేకాట దందా – 10 మంది అరెస్టు, రూ.20వేల నగదు, 9 సెల్‌ఫోన్లు స్వాధీనం

అశ్వాపురం,మే 15 ఆధాబ్ న్యూస్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వాపురం మండల పరిధిలోని పాములపల్లి గ్రామంలో పేకాట ఆడుతున్న 10 మందిని పోలీసులు అరెస్టు చేశారు. మిషన్ భగీరథ పంప్ హౌస్ సమీపంలో జరుగుతున్న పేకాటపై సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకొని దాడులు నిర్వహించారు.

ఈ దాడిలో రూ.20,000 నగదు, 9 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ అశోక్ రెడ్డి తెలిపారు. పేకాట నిర్వహిస్తున్న వారి పైన కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగుతున్నట్లు సమాచారం.

పబ్లిక్ స్థలాల్లో ఇటువంటి అక్రమ కార్యకలాపాలను ఎవ్వరూ సహించబోమని, సమాచారం అందించాలంటూ ప్రజలను పోలీసులు కోరుతున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!