ధాన్యం కొనుగోలు ప్రక్రియలో నిర్లక్ష్యం చేయొద్దు – అదనపు కలెక్టర్ హెచ్చరిక
భద్రాద్రి కొత్తగూడె, ఆధాబ్ న్యూస్:
ధాన్యం కొనుగోలు ప్రక్రియల్లో ఎవరైనా విధుల్లో నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్ హెచ్చరించారు. చండ్రుగొండ మరియు పాల్వంచ మండలాల్లో ధాన్యం సేకరణపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ఆయన ఈ ప్రకటన చేశారు.
ఫిర్యాదులపై విచారణ అనంతరం, పాల్వంచ మండలం సోమలగూడెం మరియు చంద్రుగొండ మండలం తుంగారం ప్యాక్స్ (PACS) ధాన్యం కొనుగోలు కేంద్రాల ఇన్‌చార్జిలను సస్పెండ్ చేసినట్లు తెలిపారు.
ధాన్యం సేకరణలో నిర్లక్ష్యమూ సహించదగినది కాదని, ఎవరి వల్ల అయినా రైతులకు ఇబ్బందులు కలిగితే వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మిల్లర్లు రైతులను హింసించడమో, కొనుగోలు ప్రక్రియను ఆలస్యం చేయడమో చేస్తే, వారిని కూడా వదిలేది లేదన్నారు.









