అడవి దున్న మృతి: ట్రైన్ ఢీకొని ప్రాణాలు కోల్పోయిన జంతువు
భద్రాద్రి కొత్తగూడెం, ఆధాబ్ న్యూస్:అశ్వాపురం రేంజ్ పరిధిలో విషాద ఘటన చోటుచేసుకుంది. జగ్గారం ఎర్రబొక్కల చెరువు అటవీ ప్రాంతంలో ఒక అడవి మగ దున్న రైల్వే ట్రాక్‌పై ట్రైన్ ఢీకొనడంతో మృతి చెందింది. మంగళవారం జరిగిన ఈ సంఘటన స్థానికులను కలచివేసింది.
సమాచారం అందిన వెంటనే అశ్వాపురం రేంజ్ ఆఫీసర్ రమేష్ తన సిబ్బందితో కలిసి ఘటన స్థలానికి చేరుకున్నారు. అక్కడ దున్న మృతదేహాన్ని పరిశీలించి, నివేదిక కోసం అవసరమైన సమాచారం సేకరించారు.
అటవీ అధికారులు మృత్యుదేహాన్ని తొలగించి, తదుపరి చర్యలు చేపట్టారు. రైల్వే ట్రాక్ సమీపంలోని అటవీ ప్రాంతాల్లో మృగాల సంచారం పెరుగుతుండటంతో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులేనా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
Post Views: 128









