ప్రతి క్షణం
ప్రజల పక్షం

  సూర్యాపేట డీఎస్పీ కార్యాలయంలో ఏసీబీ దాడులు – డీఎస్పీ, సీఐ అదుపులోకి

సూర్యాపేట డీఎస్పీ కార్యాలయంలో ఏసీబీ దాడులు – డీఎస్పీ, సీఐ అదుపులోకి

సూర్యాపేట, ఆధాబ్ న్యూస్:
సూర్యాపేట డీఎస్పీ కార్యాలయం పై మంగళవారం ఏసీబీ అధికారులు అకస్మాత్తుగా దాడులు నిర్వహించారు. ఓ మెడికల్ కేసులో రూ.25 లక్షలు డిమాండ్ చేసిన కేసులో సూర్యాపేట సీఐ వీరరాఘవులు, డీఎస్పీ పార్థసారథిపై ఆరోపణలు వచ్చినట్టు సమాచారం.

బాధితుడి ఫిర్యాదుతో స్పందించిన ఏసీబీ అధికారులు కేసును దర్యాప్తు చేశారు. విచారణలో డబ్బులు డిమాండ్ చేసినట్లు తేలడంతో, 16 లక్షల రూపాయల మేర ఒప్పందం జరిగినట్టు వెల్లడైంది. ఈ నేపథ్యంలో డీఎస్పీ పార్థసారథి, సీఐ వీరరాఘవులను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

అదనంగా, ఇద్దరి ఇళ్లల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ జగదీష్ మాట్లాడుతూ, ప్రభుత్వ అధికారులెవరైనా లంచం డిమాండ్ చేస్తే, అది నేరమేనని స్పష్టం చేశారు. బాధితులు ఎటువంటి భయంకు లోనవకుండా ఏసీబీకి సమాచారం ఇవ్వాలని పిలుపునిచ్చారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

రిటర్న్ సీడ్ పేరుతో రైతులకు టోకరా.. నట్టేట మునిగిపోతున్న అన్నదాతలు సీడ్ కంపెనీల మోసాలపై జేఏసీ అధ్యక్షుడు గొగ్గల కృష్ణ ఆగ్రహం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి నాసిరకం విత్తనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్