ప్రతి క్షణం
ప్రజల పక్షం

  రూ. 41 లక్షల విలువైన గంజాయి పట్టివేత – భద్రాచలం వద్ద ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సంచలన దాడి

రూ. 41 లక్షల విలువైన గంజాయి పట్టివేత – భద్రాచలం వద్ద ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సంచలన దాడి

భద్రాచలం, మే 9: ఆధాబ్ న్యూస్:
తెలంగాణలో డ్రగ్స్ నియంత్రణ చర్యల్లో భాగంగా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం చేపట్టిన ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా, భద్రాచలం వద్ద భారీగా గంజాయి పట్టుబడింది.

గోదావరి ఇసుక ర్యాంప్ సమీపంలో శుక్రవారం అనుమానాస్పదంగా వెళ్తున్న కారును ఎక్సైజ్ అధికారులు తనిఖీ చేయగా, అందులో 75 కేజీల గంజాయి బయటపడింది. ఈ విషయాన్ని ఎన్ఫోర్స్మెంట్ సీఐ రమేష్ వెల్లడించారు. ఒడిశా నుంచి రాజస్థాన్‌కు అక్రమంగా తరలించబడుతున్న ఈ గంజాయి పట్టుబడింది.

ఈ దాడిలో గంజాయి‌తో పాటు ఓ కారు స్వాధీనం చేసుకున్నారు. రెండు కలిపి దాదాపు రూ. 41 లక్షల విలువ ఉంటుందని అధికారులు తెలిపారు.

ఈ కేసులో ముగ్గురు నిందితులపై కేసు నమోదు చేశారు. వారిలో రాజస్థాన్‌కు చెందిన అనిల్ కుమార్ శర్మ, ముఖేష్ కుమార్ దేవ్‌లను అరెస్ట్ చేశారు. అలాగే, గంజాయి సరఫరా చేసిన పాల్వంచకు చెందిన దుర్గాప్రసాద్‌పై కూడా కేసు నమోదు చేశారు. నిందితుల విచారణలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.

ఈ దాడిలో పాల్గొన్న ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ టీంలో పాల్గొన్న వారు:

1. తిరుపతి (AES)

2. రమేష్ (EI)

3. కరీం (హెడ్ కానిస్టేబుల్)

4. బాలు (హెడ్ కానిస్టేబుల్)

5. సుధీర్ (EC)

6. హరీష్ (EC)

7. విజయ్ (EC)

8. హనుమంతు (EC)

 

ఈ విజయవంతమైన దాడికి రాష్ట్ర ఎక్సైజ్ కమిషనర్ హరికిరణ్ ఐఏఎస్, ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ షానవాజ్ ఖాసీం ఐపీఎస్ ఆధ్వర్యంలో ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు.

ఈ సందర్భంగా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ జనార్దన్ రెడ్డి, అసిస్టెంట్ కమిషనర్ గణేష్‌లు గంజాయి పట్టుకున్న ఎన్ఫోర్స్మెంట్ టీంను అభినందించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!