ప్రతి క్షణం
ప్రజల పక్షం

  ఇల్లందులో పేకాట దందా కలకలం – ఎనిమిది మంది అరెస్టు,

ఇల్లందులో పేకాట దందా కలకలం – ఎనిమిది మంది అరెస్టు,

ఇల్లందు, ఆధాబ్ న్యూస్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం కట్టుగూడెంలో పేకాట ఆడుతున్న ఘటనపై పోలీసులు ఆకస్మిక దాడి నిర్వహించారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఇల్లందు సీఐ బత్తుల సత్యనారాయణ నేతృత్వంలో పాత పెంకు ఫ్యాక్టరీపై దాడి జరిగిందని సమాచారం.

ఈ దాడిలో ఎనిమిది మంది పేకాట ఆడుతున్నవారిని అరెస్టు చేశారు. మరో వ్యక్తి పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. దాడిలో రూ.46 వేలు నగదు, 8 సెల్‌ఫోన్లు, ఒక కారు, ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 9 మందిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్టు తెలిపారు.

పేకాట వంటి అక్రమ చర్యలపై కఠినంగా వ్యవహరిస్తామని ఇల్లందు సీఐ బత్తుల సత్యనారాయణ హెచ్చరించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!