వెలగపూడి ఎలిప్యాడ్ వద్ద ప్రధాని నరేంద్ర మోడీకి ఘన స్వాగతం.
ఆధాబ్ న్యూస్, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి శాశ్వత రాజధానిగా అమరావతిని అధికారికంగా ప్రకటించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు అమరావతికి విచ్చేశారు. వెలగపూడి హెలిప్యాడ్ వద్ద ఆయనకు ఘన స్వాగతం లభించింది. గవర్నర్ అబ్బుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొని ప్రధానికి ఆత్మీయంగా స్వాగతించారు.
వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభానికి శ్రీకారం చుట్టే మోదీ పర్యటన, అమరావతికి రాజధాని హోదా ప్రకటనకు ముందు అడుగుగా భావిస్తున్నారు. కేంద్రం నుంచి వచ్చే మద్దతుతో రాష్ట్ర రాజధాని నిర్మాణం మళ్లీ వేగం పుంజుకునే అవకాశముందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ప్రస్తుతం రాష్ట్ర ప్రజల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అమరావతి పునర్నిర్మాణం, రాజధాని బలమైన భవిష్యత్తు వైపు అడుగులు వేస్తుంది









