ప్రతి క్షణం
ప్రజల పక్షం

  తెలంగాణ పదో తరగతి ఫలితాలు 28&30 విడుదలకు తేదీ ఖరారు?

తెలంగాణ పదో తరగతి ఫలితాలు 28&30 విడుదలకు తేదీ ఖరారు?

హైదరాబాద్‌, ఆధాబ్ న్యూస్
తెలంగాణలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు రాసిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫలితాల విడుదలపై స్పష్టత వచ్చింది. ఇటీవలే ఆంధ్రప్రదేశ్‌లో టెన్త్ ఫలితాలు విడుదల కాగా, తెలంగాణలో మాత్రం ఆలస్యం కొనసాగుతోంది. ఇప్పటికే ఇంటర్ ఫలితాలు వెలువడినా, పదో తరగతి ఫలితాల కోసం విద్యార్థులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

తాజా సమాచారం ప్రకారం, ఈనెల 28& 30న పదో తరగతి ఫలితాలు విడుదల చేయనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.? డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చేతుల మీదుగా ఫలితాలు విడుదల చేసే అవకాశముంది. ఫలితాల ప్రకటనకు సంబంధించి విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది.

వాస్తవానికి, వారం రోజుల క్రితమే మూల్యాంకన ప్రక్రియ, మార్కుల కంప్యూటరీకరణ, సమాధాన పత్రాల వెరిఫికేషన్ వంటి ప్రక్రియలు పూర్తయ్యాయి. మొదట్లో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఫలితాలను విడుదల చేయాలని అధికారులు భావించినప్పటికీ, చివరికి ఈ బాధ్యతను డిప్యూటీ సీఎంకు అప్పగించారు.

ఇందులో భాగంగా డిప్యూటీ సీఎంతో ఫలితాల విడుదలకు సంబంధించిన సమీక్ష సమావేశాలు కూడా నిర్వహించినట్లు సమాచారం. అన్ని ఏర్పాట్లు పూర్తికావడంతో, మే నెల మొదటి వారంలో విద్యార్థులు తమ ఫలితాలను చూసే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!